స్థానిక సంస్థల పదవీ బాధ్యతల తేదీలు ఖరారు…

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ నూతన పాలక మండళ్లలో పదవీ బాధ్యతల తేదీలు ఖరారయ్యాయి. జులై 4వ తేదీ నుంచి మండల పరిషత్‌ పదవీకాలం ప్రారంభం కానుంది. జులై 5వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌ పదవీకాలం ప్రారంభం కానుంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని మండల పరిషత్‌ల పదవీకాలం ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. గార్ల, బయ్యారం మండల పరిషత్‌ల పదవీ కాలం ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. వాజేడు, వెంకటాపురం మండల పరిషత్‌ల […]

Continue Reading

24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు శంకుస్థాపన

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో కార్యవర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. సభ్యత నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. జూన్‌ 27వ తేదీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం కానుంది. కాళేశ్వరం ప్రారంభోత్సవం […]

Continue Reading

నాగ‌శౌర్య‌ని ప‌రామ‌ర్శించిన రాఘ‌వేంద్ర‌రావు

ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరోలు వ‌రుస‌గా ప్ర‌మాదాల బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య‌ యాక్ష‌న్ సీన్‌లో భాగంగా బిల్డింగ్‌పై నుండి కింద ప‌డి గాయ‌ప‌డ్డాడు. ఆయ‌న ఎడ‌మ కాలికి తీవ్ర‌గాయ‌మైంది. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. 15 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై నుండి నాగ‌శౌర్య కింద‌కి దూకే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న స‌రైన ప్ర‌దేశంలో ల్యాండింగ్ కాక‌పోవ‌డంతో అత‌ని మోకాలికి గాయ‌మైంది. వైద్యులు 25-30 రోజులు పూర్తి విశ్రాంతి […]

Continue Reading

జులైలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు – ఘంటా చక్రపాణి

గ్రూప్‌-2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి శుభవార్త వినిపించారు. జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఘంటా చక్రపాణి కలిసి టీఎస్‌పీఎస్సీ 2017-18 వార్షిక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, ఇంటర్వ్యూలన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తయింది.. ఆ నివేదికను […]

Continue Reading

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు విడుదల

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ పరీక్షకు 52,380 మంది విద్యార్థులు హాజరు కాగా, 41,195 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 31,299 మంది మహిళలు కాగా, 9,896 మంది పురుషులు ఉన్నారు. మే 31న జరిగిన ఎడ్‌సెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం edcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.

Continue Reading

ఐదేళ్ళ త‌ర్వాత సినిమా చేస్తున్న ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు

గుండె జారి గల్లంతయిందే(2013), ఒక లైలా కోసం(2014) వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్న విజయ్ కుమార్ కొండ కొన్నాళ్ళుగా సినిమాల‌కి దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు సంవ‌త్స‌రాలుగా ఆయ‌న నుండి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ఆ మ‌ధ్య ప్రేమ‌, పెళ్ళి వ‌ల‌న ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం త‌న లైఫ్ స‌వ్యంగానే సాగుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు దృష్టి అంతా సినిమాల‌పైనే కేంద్రీకరించిన‌ట్టు తెలుస్తుంది. కుర్ర హీరో రాజ్‌త‌రుణ్‌తో త‌న తాజా ప్రాజెక్ట్‌ని సెట్ చేశాడు […]

Continue Reading

ఈ నెల 21న ఘట్‌కేసర్‌లో సదరం క్యాంపు

ఈ నెల 21న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్‌కేసర్ ప్రభుత్వ దవాఖానలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్య తెలిపారు. వేసవి కాలంలో అధిక ఎండల కారణంగా నిర్వహించలేదని అన్నారు. సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Continue Reading

టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

శంషాబాద్ ఎయిర్‌పోర్టు క్యాంపస్‌లోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఔత్సాహికులైన మహిళలకు రెండు నెలల పాటు టైలరింగ్ కోర్సుల్లో ఉచిత, భోజన, వసతి, శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండి, 5వ తరగతి ఆపై చదువుకున్న వారు అర్హులని, మరిన్ని వివరాలకు ఫోన్ : 94948 00102, 84668 16090లోగానీ, స్వయంగా గానీ సంప్రదించవచ్చన్నారు.

Continue Reading

విదేశీ పెండ్లి కుమారులే టార్గెట్‌గా మోసాలు

విదేశీ పెండ్లి కుమారులను మోసం చేస్తున్న లెక్చరర్ అర్చనను మంగళవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు మరోకేసులో ఆమెను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసుల కథనం…అమెరికాలో నివాసం ఉంటున్న సాఫ్‌వేర్ ఇంజినీర్ సింహాద్రి భారత్ మ్యాట్రిమోని వెబ్‌సైట్ యువతి ప్రొఫైల్ చూసి వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇద్దరు అభిప్రాయాలు కుదరడంతో వివాహానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో అర్చన.. సింహాద్రికి వాట్సాప్‌లో ఫోన్ చేసి అమెరికాలోని […]

Continue Reading

జల వివాదాలకు కాంగ్రెస్సే కారణం – ఎమ్మెల్యే బాల్క సుమన్‌

అంతర్‌ రాష్ట్ర జల వివాదాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని చెన్నూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడిలా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. 16 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేలా కాంగ్రెస్‌ ప్రాణహితకు డిజైన్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ మాత్రం 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌ చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ టీఆర్‌ఎస్‌ […]

Continue Reading