కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన డీకే అరుణ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్. మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. మంగళవారం రాత్రి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరుణకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అమిత్ షా. రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని డీకే అరుణ స్పష్టం చేసింది. అయితే మంగళవారం ఉదయం అరుణ.. హైదరాబాద్‌లోని బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికెళ్లి […]

Continue Reading

తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది – కేసీఆర్

తెలంగాణ ఉద్యమానికి ఆక్సీజన్ అందించిన జిల్లా నిజామాబాద్ జిల్లా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. నిజాంసాగర్‌తో నాడు అత్యంత ధనిక జిల్లాగా నిజామాబాద్ పేరొందిందని, సమైక్య పాలకుల కారణంగా నేడు నిజాంసాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో […]

Continue Reading

సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు – కవిత

జాతీయ రాజకీయాల గురించి దేశమంతా ఆలోచన జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాలతో గెలిపించుకున్నాం. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు సాధించుకుని..మన నాయకుడిని గెలిపించుకున్నాం. ప్రజలకు కొన్ని వాగ్దానాలు […]

Continue Reading

వివేకా హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని, వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని అంటున్నారు. హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య […]

Continue Reading

వివేకా హత్యకేసులో ఇంటిదొంగలు బయటపడ్డారు- వర్ల రామయ్య

రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్‌ వివేకానందరెడ్డి చావును టీడీపీకి అంటగట్టిన జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసులో ఇంటిదొంగలు బయటపడ్డారని చెప్పారు. జగన్‌కు అవకాశమిస్తే ఏపీ ప్రజలను బతకనిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ప్రశాంత్‌కిషోర్‌ అత్యంత ముఖ్యమైన వ్యక్తని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.

Continue Reading

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘‘కేసీఆర్ నాకు ఒక బర్త్‌డే గిఫ్ట్ ఇస్తే.. నేను 10 బర్త్‌ డే గిఫ్ట్‌లు ఇస్తా’’ అని హెచ్చరించారు. మంగళవారం అనంతలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. జగన్, కేసీఆర్, మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పంపించే డబ్బులకు ఏపీలో ఓట్లు రావని అన్నారు. ఏం చేశాడని జగన్‌కు 22 ఎంపీ సీట్లు వస్తాయని ప్రశ్నించారు. జగన్‌ను కేసీఆర్ పావుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. 16 సీట్లు ఇస్తే […]

Continue Reading

ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబే -జగన్

ఏపీకి ప్రత్యేక హోదాను దగ్గరుండి నీరుగార్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు.  వేమూరులో వైఎస్ జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా తెస్తానన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి.. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని ఆరోపించారు. హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబే అని, ఇప్పుడు నల్లచొక్కా వేసుకుని సినిమా […]

Continue Reading

16 మంది ఎంపీలతో కేసీఆర్ చేసేదేమీ లేదు – రేవంత్ రెడ్డి

మల్కాజ్‌గిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. పార్లమెంట్ పరిధిలో వివిధ పార్టీల నేతల మద్దతు తీసుకుంటున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ నాయకులు శ్రీ గణేష్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. భవిష్యత్‌లో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని అన్నారు. గతంలో 12 మంది ఎంపీలను గెలిచిన కేసీఆర్ ఏమీ చేయలేదని, ఇప్పుడు 16 మందితో కూడా చేసేదేమీ ఉండదని అన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ […]

Continue Reading

రాహుల్ గాంధీకి ధన్యవాదాలు – కోమటిరెడ్డి

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించినందుకు పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 22న నామినేషన్ వేస్తానని వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలు మోదీ-రాహుల్ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని, కేసీఆర్ ఒక్కడి వల్లే […]

Continue Reading

నిజామాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ బహిరంగ సభ నేడు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్‌కు చేరుకున్నారు. బహిరంగ సభకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎంపీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్ తో పాటు ఏడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, […]

Continue Reading