డబుల్ సెంచరీ కొట్టిన స్టార్ హీరో సినిమా

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారత్. అలీ అబ్బాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈద్ కానుకగా జూన్ 5న విడుదలైన ఈ చిత్రంకు మాస్, క్లాస్ ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. భారత్ చిత్రం రెండు వారాల్లో రూ.201.86 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సౌత్ కొరియన్ సినిమా ఆడ్ టు మై […]

Continue Reading

ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 6జడ్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నో నాచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లిప్ అప్ […]

Continue Reading

కోహ్లీసేన‌కు షాక్‌..వరల్డ్‌కప్ నుంచి ధావన్ ఔట్

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ. గాయపడ్డ శిఖర్ ధావన్ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే సూచనలు కన్పించకపోవడంతో అతని స్థానంలో ఇంకో ఆటగాడిని తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అతడు టీమ్ నుంచి తప్పుకుంటే అతని స్థానంలో రిషబ్ పంత్‌ను అధికారికంగా తుదిజట్టుకు ఎంపిక చేశారు. పంత్ ఇప్పటికే ఇంగ్లాండ్‌కు వచ్చి జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు.

Continue Reading

డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి మాకెందుకు ?

లోక్‌స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని స్వీక‌రించేందుకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇష్టంగా లేన‌ట్లు తెలుస్తోంది. ఆ పోస్టును ఆఫ‌ర్ చేసేందుకు మోదీ స‌ర్కార్ ఆస‌క్తిగా ఉంది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ పార్టీకి కూడా తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. కానీ వైఎస్ఆర్‌సీపీ మాత్రం డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ప‌ట్ల ఆస‌క్తిగా లేద‌ని తెలుస్తోంది. ఆ పోస్టుతో మాకు వ‌చ్చేది ఏమీ లేదు, ప్ర‌త్యేక హోదా ఇచ్చేంత వ‌ర‌కు ప్ర‌భుత్వంతో క‌లిసేది లేద‌ని వైఎస్ఆర్ పార్టీ చెప్పిన‌ట్లు స‌మాచారం. జ‌మిలి ఎన్నిక‌ల విధానంపై […]

Continue Reading

జ‌మిలి ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ వ్య‌తిరేకం !

జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హణ‌ను కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ది. వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ నినాదంతో ఇవాళ ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్టం చేసింది. జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ఒకేసారి నిర్వ‌హించాల‌న్న‌దే జ‌మిలి ఎన్నిక‌ల విధానం. ఆ విధానాన్ని తీసుకురావాల‌ని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ నేప‌థ్యంలో మోదీ ఇవాళ […]

Continue Reading

మ‌సీదులో రాముడు.. గుడిలో రెహ్మాన్ ద‌ర్శ‌న‌మిస్తే..

కాంగ్రెస్ ప‌క్ష‌నేత‌ అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఇవాళ లోక్‌స‌భలో మాట్లాడారు. స్పీక‌ర్ ఓం బిర్లా ఏక‌గ్రీవంగా ఎన్నికైన నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున శుభాకాంక్ష‌లు చెప్పారు. మ‌తాల ఐక్య‌త అవ‌స‌రం అని అధిర్ స‌భ‌లో తెలిపారు. రెండు రోజుల పాటు స‌భ‌లో నినాదాలు చోటుచేసుకున్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కుదాసే క్యా మాంగూ అంటూ.. దేవున్ని నీ గురించి ఏమ‌ని ప్రార్థించాలి.. నీ దారి మొత్తం సంతోషాల‌తో నిండిపోవాలంటూ అధిర్‌.. త‌న క‌విత‌ల‌తో స్పీక‌ర్‌ను ఖుషీ […]

Continue Reading

సరస్సులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత

ర్షాకాలం ప్రారంభమైనా వరుణుడు మాత్రం కరుణించడం లేదు. అన్నదాతలు వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వర్షం లేకపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండతీవ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎండలకు చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో జలజీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. తమిళనాడులో ఎండతీవ్రతకు చెరువులు నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. కోయంబత్తూరు పరిధిలోని చింతామణి సరస్సులోని చేపలు వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. చెరువుల్లో అట్టడుగున ఉన్న కొద్దిపాటి నీరు కలుషితం కావడంతో భారీ సంఖ్యలో చేపలు చనిపోయి..ఒడ్డుకు […]

Continue Reading

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ ప‌డిలోకి అడుగు పెట్టింది. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం త‌మిళం, హిందీ భాష‌ల‌లోను రాణిస్తుంది. రీసెంట్‌గా సీత అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం కాజ‌ల్ కిట్టీలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉండ‌గా, శ‌ర్వానంద్‌తో క‌లిసి ర‌ణ‌రంగం అనే సినిమా చేస్తుంది. ఇందులో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కూడా న‌టిస్తుంది. సుధీర్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న […]

Continue Reading

సైకిల్‌పై భారత యాత్ర

జాతీయ సమగ్రత, దేశభక్తి, విశ్వశాంతి, గోరక్ష, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి పొదుపును కాంక్షిస్తూ ఐదు పదుల వయస్సులో ఓ వ్యక్తి దేశ వ్యాప్త సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కర్నాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు హెచ్‌ఎన్ నాగరాజు గౌడ్ 2017 డిసెంబర్ 3న తన స్వగ్రామం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. వివిధ రాష్ర్టాలు ప్రయాణిస్తూ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద తన యాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. కర్నాటక నుంచి ప్రారంభమైన యాత్ర […]

Continue Reading

మా చావుకు అనుమతివ్వండి ప్రధాని గారూ..

మా చావుకు అనుమతివ్వండి ప్రధాని గారూ అని ఓ వ్యక్తి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్‌రాష్‌ గ్రామంలో తీవ్రమైన నీటి కొరత ఉంది. ఒక వేళ నీరు లభించినా అది ఉప్పు నీరే. దీంతో ఆ గ్రామ ప్రజలకు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చంద్రకల్‌ సింగ్‌, అతని ముగ్గురు కుమార్తెలు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. తమ గ్రామంలో తీవ్రమైన నీటి […]

Continue Reading