ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 6జడ్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నో నాచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లిప్ అప్ […]

Continue Reading

‘ఆర్‌వీ400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆవిష్కరణ

అంకుర ఎలక్ట్రిక్‌ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌.. ‘ఆర్‌వీ400’ పేరిట తన అధునాతన ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఈ బైక్‌… ఒక్కసారి చార్జ్‌ చేస్తే 156 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేయడానికి నాలుగు గంటలు పడుతుండగా.. చార్జింగ్‌ ఇబ్బందులను అధిగమించడం కోసం ఆన్‌ బోర్డ్, పోర్టబుల్‌ చార్జింగ్‌తో పాటు హోమ్‌ డెలివరీ ఆప్షన్లను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో దేశంలోని అన్ని […]

Continue Reading

లక్షద్వీప్‌లో 4జీ సర్వీసులను ప్రారంభించిన తొలి ఆపరేటర్.. ఎయిర్‌టెల్..

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ లక్షద్వీప్‌లో ఇవాళ 4జీ సర్వీసులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 4జీ సర్వీసులను ప్రారంభించిన తొలి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ పేరుగాంచింది. కాగా లక్షద్వీప్‌లోని అగట్టి, బంగారం, కవరాట్టి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 4జీ సేవలు లభిస్తున్నాయి. అయితే మరో ద్వీపమైన అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే ఎయిర్‌టెల్ 4జీ సేవలను లాంచ్ చేసింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ సిమ్‌లను 4జీకి […]

Continue Reading

ఇంధ‌న నౌక‌ల పేల్చివేత‌.. గ‌ల్ఫ్‌కు అమెరికా ద‌ళాలు

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఇరాన్‌తో త‌లెత్తిన ఉద్రిక్త‌త ఇప్పుడు గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితికి దారి తీస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా ఆ రూట్లో వెళ్తున్న ఇంధ‌న నౌక‌ల‌ను పేల్చేస్తున్న నేప‌థ్యంలో.. అమెరికా ప్ర‌త్యేక ద‌ళాల‌ను మోహ‌రిస్తోంది. అద‌నంగా సుమారు వెయ్యి మంది భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మిడిల్ ఈస్ట్‌కు అమెరికా పంపిస్తోంది. గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్‌లో గ‌త వారం రెండు నౌక‌ల‌కు నిప్పు అంటించారు. ఆ ప‌ని చేసింది ఇరాన్ అని తాజాగా […]

Continue Reading

ఈ ట్రాన్స్‌లేటర్ 34 భాషలను రియల్‌టైంలో తర్జుమా చేస్తుంది..!

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తాజాగా ఎంఐ ఏఐ ట్రాన్స్‌లేటర్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆక్స్‌ఫర్డ్, కొలిన్స్ డిక్షనరీలు ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా లభిస్తున్నాయి. అలాగే మరో 3 చైనీస్ డిక్షనరీలను కూడా ఈ డివైస్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇంగ్లిష్ పదాలను సరిగ్గా ఎలా ఉచ్ఛరించాలో నేర్చుకోవచ్చు. అలాగే చైనీస్, ఇంగ్లిష్, జపనీస్, కొరియన్, జర్మన్ భాషలకు ఇందులో ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ట్రాన్స్‌లేటర్ ద్వారా 224 దేశాల ప్రజలు […]

Continue Reading

నాలుగ‌వ‌సారి.. నీర‌వ్ మోదీకి బెయిల్ ద‌క్క‌లేదు

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ‌వేసిన కేసులో ప‌రారీలో ఉన్న నీర‌వ్ మోదీ లండ‌న్ కోర్టులో బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇవాళ ఆ బెయిల్ పిటిష‌న్‌ను.. రాయ‌ల్ కోర్ట్స్ ఆఫ్ జ‌స్టిస్ తిర‌స్క‌రించింది. నీర‌వ్ మోదీకి బెయిల్‌ను తిర‌స్క‌రించ‌డం ఇది నాలుగ‌వ సారి. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మూడు సార్లు నీరవ్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హైకోర్టులో బెయి ల్ పిటీషన్ వేశాడు. మ‌రోవైపు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే […]

Continue Reading

ఎంఐ బ్యాండ్ 4ను విడుదల చేసిన షియోమీ

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌బ్యాండ్.. ఎంఐ బ్యాండ్ 4 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 0.95 ఇంచుల అమోలెడ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అంతకు ముందు వచ్చిన ఎంఐ బ్యాండ్ 3 కన్నా ఈ బ్యాండ్ డిస్‌ప్లే 39.9 శాతం పెద్దదిగా ఉంటుంది. అలాగే ఎంఐ బ్యాండ్ 4 లో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 5 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను […]

Continue Reading

బెయిల్‌ కోసం మళ్లీ బ్రిటన్‌ కోర్టుకు నీరవ్‌ మోదీ

 పీఎన్‌బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ కోసం మరోసారి బ్రిటన్‌లో ఎగువ కోర్టును ఆశ్రయించారు. నీరవ్‌ మోదీకి గతంలో బెయిల్‌ ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఇప్పటికే ఆయన బెయిల్‌ వినతిని మూడు సార్లు తోసిపుచ్చింది. కాగా మోదీని ఉంచిన వ్యాండ్స్‌వర్త్‌ జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు నివేదించినా బెయిల్ మంజూరుకు న్యాయస్ధానం […]

Continue Reading

అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్.. భారీ తగ్గింపు ధరలకు ఫోన్లు..!

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఇవాళ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా భారీ డిస్‌ప్లే ఉన్న ఫోన్లతోపాటు పలు యాక్ససరీలపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ X రూ.23,991 తగ్గింపు ధరతో రూ.67,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఐఫోన్ XR (64జీబీ) రూ.58,999 ధరకు (రూ.17,901 తగ్గింపు), వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ లిమిటెడ్ ఎడిషన్ రూ.41,999 (రూ.9వేలు తగ్గింపు) ధరకు, హానర్ వ్యూ […]

Continue Reading

నోకియా 8.1 ధర భారీగా తగ్గింది..!

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లు రెండింటి ధరలను రూ.7వేల మేర తగ్గించారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999 ఉండగా, ఇప్పుడిది రూ.19,999 ధరకు లభిస్తున్నది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,999 ఉండగా ఇప్పుడీ వేరియెంట్ రూ.22,999 ధరకు లభిస్తున్నది. […]

Continue Reading