22వ తేదీ నుంచి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సంఘాల్‌కు అందజేశారు. కొత్తగా ఏర్పడిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైవీసుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు కొత్త సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకరం చేసే […]

Continue Reading

డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి మాకెందుకు ?

లోక్‌స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని స్వీక‌రించేందుకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇష్టంగా లేన‌ట్లు తెలుస్తోంది. ఆ పోస్టును ఆఫ‌ర్ చేసేందుకు మోదీ స‌ర్కార్ ఆస‌క్తిగా ఉంది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ పార్టీకి కూడా తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. కానీ వైఎస్ఆర్‌సీపీ మాత్రం డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ప‌ట్ల ఆస‌క్తిగా లేద‌ని తెలుస్తోంది. ఆ పోస్టుతో మాకు వ‌చ్చేది ఏమీ లేదు, ప్ర‌త్యేక హోదా ఇచ్చేంత వ‌ర‌కు ప్ర‌భుత్వంతో క‌లిసేది లేద‌ని వైఎస్ఆర్ పార్టీ చెప్పిన‌ట్లు స‌మాచారం. జ‌మిలి ఎన్నిక‌ల విధానంపై […]

Continue Reading

మాట తప్పిన చంద్రబాబును నిలదీయాలి..!

రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి విమ‌ర్శించారు. చంద్ర‌బాబు హామీ అయిన రుణమాఫీని అమలు చేయాలన్న చంద్రబాబుపై ట్విటర్‌ వేదికగా విజయ సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న ట్విట‌ర్‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. […]

Continue Reading

మాట తప్పిన చంద్రబాబును నిలదీయాలి..!

రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి విమ‌ర్శించారు. చంద్ర‌బాబు హామీ అయిన రుణమాఫీని అమలు చేయాలన్న చంద్రబాబుపై ట్విటర్‌ వేదికగా విజయ సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న ట్విట‌ర్‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. […]

Continue Reading

మహిళ హత్య

సూర్యాపేట మండలం కేసారంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను కత్తితో పొడిచి హత్య చేశారు. భర్త పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. భర్త వీరయ్యపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Continue Reading

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 83,840 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.34 కోట్లుగా ఉంది.

Continue Reading

ఓటమి తప్పదని గ్రహించే రాజీనామా చేయించలేదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్‌కు ఓటమి తప్పదని టీడీపీకి ముందే తెలిసి ఆయన చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్వీట్‌ సారాంశం.. ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రమోషన్లిచ్చారు. పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి […]

Continue Reading

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇవాళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు పార్టీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. గతేడాది స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనకు ఏ పదవి, బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె […]

Continue Reading

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చు వైరల్‌

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. త‌న ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు వేల కోట్ల ప్రజాధనాన్ని అవ‌స‌రంలేని స‌మ్మిట్లు, విదేశీ ప్రయాణాలకు దుబారాగా ఖర్చు చేశార‌ని ఆరోపించారు. ట్విట‌ర్ వేదిక‌గా ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శించారు. ట్విట‌ర్‌లో స్పందిస్తూ.. ‘చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఒక పత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మొదటి ఆరు నెలల్లో సారు(చంద్ర‌బాబు) నెల రోజులు […]

Continue Reading

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన వైసీపీ నుంచి బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. కోన రఘుపతిని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కోన రఘుపతి ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం సభ్యులు అభినందనలు తెలియజేశారు. కోన రఘుపతిని గౌరవ పూర్వకంగా సభాపతి కూర్చీవరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రతపక్ష నేత చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు.

Continue Reading