హైకోర్ట్ కి వెళ్ళిన ప్రభాస్

టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిని సీజ్ చేయడంపై ప్రభాస్ సీరియస్ గా స్పందించారు. వెంటనే హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాస్ పిటిషన్ ను స్వీకరించిన హై కోర్ట్ ఈరోజు విచారించనుంది. ఈ భూమి పత్రాలు తన వద్ద ఉన్నాయని.. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని తనకు అమ్మారని హీరో ప్రభాస్ ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని వదులుకునేది లేదని.. అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని.. దీనిపై న్యాయపోరాటానికి ప్రభాస్ సిద్ధమయ్యారు.

ఈ స్థలంపై ప్రభుత్వానికి.. ప్రైవేటు వ్యక్తులకు సుప్రీం కోర్టులో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రభుత్వం ఈ స్థలం తమదేనని స్వాధీనం చేసుకోవడంతో ప్రైవేటు వ్యక్తులు హైకోర్టుకు సుప్రీంకు వెళ్లారు. ఈ స్థలం ప్రభుత్వ స్వాధీనంపై స్టే ఇచ్చింది. అయితే శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లి స్థలంపై స్టే ఎత్తివేయించారు. సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వ స్థలంగా తీర్పునిచ్చింది.ఇందులో ప్రభాస్ స్థలం కూడా ఉండడంతో సీజ్ చేశారు. ఈ విషయం ఫై సుప్రీం కోర్ట్ తీర్పు కోసం అందరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *