ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎంపీల ఆందోళన

ప్రత్యేక హోదా కోరుతూ గత రెండు రోజులుగా పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాకం విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు నిన్న పార్లమెంట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. బుధవారం కూడా విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *