జగన్, ఓవైసీల దోస్తీ మోదీ కుదిర్చారా – చంద్రబాబు

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీలు ఎప్పుడు దెస్తులయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బహుసా జగన్మోహన్ రెడ్డి, ఓవైసీల మధ్య మోడీనే దోస్తానా కుదిర్చి ఉంటారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్ సభలో సోనియా గాంధీ చెప్పగానే కేసీఆర్ తెలంగాణలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ తొలుత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇచ్చిందని కానీ తరువాత మాటమార్చిందని చంద్రబాబు విమర్శించారు. దేశంలో మూడో కూటమి అంటే భారతీయ జనతా పార్టీకి దొడ్డిదారిన మేలు చేయడమే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ పాలనను తిరస్కరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *