కార్మికుల కలెక్టరేట్ ముట్టడి

మచిలీపట్నంకనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ను ముట్టడించారు. బుధవారం కార్మికులు కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులుకార్మికుల మధ్య వాగ్వివాదంతోపులాట జరిగింది. ఉద్యమ నాయకులతో పాటు పలువురు కార్మికులను అరెస్ట్ చేసారుకార్మికులను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయగా, రోప్ పార్టీతో కట్టడి చేశారు. అరెస్ట్ చేసిన కార్మికులను సమీపంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారుఅక్రమ అరెస్ట్లను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట కార్మికుల ఆందోళన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *